“ ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రదర్శించే చురుకుదనం, ఆయన ఆలోచనా ధోరణి లోని విస్తృతి, భారతదేశం విషయంలో ఆయనకు గల అతి పెద్ద ఆకాంక్షలు, ఆయన ప్రవృత్తి భారతదేశాన్ని పునరుజ్జీవనం బాటలో నడిపించి, ప్రపంచ సమాజం నుండి ఆరాధన, గౌరవం రెండింటినీ తీసుకువచ్చాయి. “సాధించి తీరతాం” అనే గట్టి విశ్వాసం ఈ రోజు సర్వత్రా ఆవరించింది. ప్రతి ఒక్కరికీ లాభదాయకంగా ఉండే ఒక బలమైన, సుస్థిర ఆర్థిక వృద్ధికి ఆయన పునాదులు వేశారు. భారతదేశ ప్రజల ప్రధాన సేవకుడిని నేను అని ఆయన ప్రకటించుకోవడం వెనుక కోట్లాది భారతదేశ ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి. ఆయన నాయకత్వం అందిస్తున్న స్ఫూర్తితో కలలు సాకారం చేసుకొనే దిశగా ఆయన, ఎంతో ప్రతిభాపాటవాలు కలిగిన ఆయన బృందమూ కృషి చేస్తున్నాయి. ’’