కేకి మిస్త్రీ, హెచ్ డిఎఫ్ సి వైస్ ఛైర్మన్ అండ్ సిఇఒ
మనం ఏళ్ళ తరబడి అమలులో ఉన్నటువంటి ఒక విధమైన పన్నుల విధానానికి అలవాటు పడిపోయాం.  ఈ కారణంగా ఒక స్థాయి సౌఖ్యం పరిచయమైంది.  అయితే అదే సమయంలో, ఏదైనా కొత్తది వస్తోందనే సరికి అధైర్యంగా అనిపిస్తుంది.  కానీ దీర్ఘకాలంలో ఇది తప్పక ప్రయోజకారి కాగలదు.  దీర్ఘ కాలంలో ఇది దేశాన్ని ఒక్కటిగా చేస్తుంది.  ఉమ్మడి పన్ను విధానాన్ని తీసుకువస్తుంది.  అలాగే, ఏ విధమైన పన్నుల ఎగవేతను, స్లిప్పేజిలను లేదా అటువంటి ధోరణులను అడ్డుకుంటుంది కూడాను.  కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది గొప్ప మేలును చేకూర్చుతుంది.