అవినీతిని తరిమికొట్టాలన్న లక్ష్యంలో భాగంగా అధిక విలువ నోట్లు రద్దు చేయాలన్నప్రధాన మంత్రి శ్రీ మోదీ నిర్ణయం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై పటిష్ఠమైన, సానుకూల ప్రభావాన్ని ప్రసరిస్తుంది. భారతదేశం తీసుకొన్న ఈ చర్య పై అధ్యయనాలు కూడా (ఇతర దేశాల ద్వారా) జరుగుతాయి. ఇంతటి పెద్ద దేశంలో ఈ విధమైన భారీ స్థాయి నోట్ల రద్దు ఇంతవరకు చోటు చేసుకోనేలేదు.