క‌న్వ‌ల్ సిబల్
“ ఇంత‌వ‌ర‌కు బ‌య‌ట‌కు రాని భార‌త సామ‌ర్థ్యాలు వెలుగులోకి  రావాలంటే శ్రీ న‌రేంద్ర‌ మోదీ వంటి శ‌క్తివంత‌మైన నాయ‌కుడు ఎంతో అవ‌స‌రం.  మాన‌వ నాగ‌రికత‌ను అభివృద్ధి చేయ‌డంలో ఆసాధార‌ణ పాత్ర పోషించిన‌, అద్భుత‌మైన మేధో సంప‌త్తి గ‌ల‌, ఆర్థికంగా పురోగ‌తిని సాధిస్తున్న భార‌తదేశానికి నేటి ప్ర‌పంచంలో స‌రైన పాత్ర కావాల‌ని ఆయ‌న ఆకాంక్షిస్తూ ఉంటారు.  అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ఆయ‌న చూపే ఆత్మ‌విశ్వాసం, త‌న‌పై త‌న‌కు గ‌ల ఆపార‌మైన న‌మ్మ‌కం ద‌శాబ్దాల కాలంలో మ‌నం ఎవ‌రిలోనూ చూడ‌లేదు.   ప్ర‌పంచంలోని ప్ర‌ధాన‌ నాయ‌కుల‌తో ఎంతో క‌లివిడిగా ఉండే ఆయ‌న ధోర‌ణి  ఆయ‌న‌ లోపలి అసాధార‌ణ దౌత్య నైపుణ్యాల‌కు నిద‌ర్శ‌నం.