క‌న్వ‌ల్ సిబాల్
“ త‌న క‌న్నా ముందు ప‌నిచేసిన ఎంద‌రో భార‌తీయ ప్ర‌ధాన మంత్రుల వ‌లె కాకుండా న‌రేంద్ర మోదీ భార‌త‌దేశం మ‌రియు భార‌తదేశ ప్ర‌జ‌ల అవ‌స‌రాలు ఏమిటన్న‌ విషయంలో సుస్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌నను క‌లిగి వున్నారు.  ఆయ‌న తొలి నాళ్ళ‌లో భార‌త‌దేశమంత‌టా ప్ర‌యాణించిన‌వారు కావ‌డం, త‌న రాజ‌కీయ పురోగ‌తి వార‌స‌త్వం మీద కాకుండా ప‌నితీరు మీద ఆధార‌ప‌డిన‌టువంటిది కావ‌డం, భార‌త‌దేశంలో అత్యంత చురుకైన రాష్ట్రాల‌లో ఒక రాష్ట్రానికి రాజకీయ అధిప‌తిగా ఆయ‌న గ‌డించిన అనుభ‌వం.. ఇవి మ‌న సువిశాల‌మైన మ‌రియు వివిధ రాష్ట్రాలతో కూడిన దేశానికి నాయ‌క‌త్వం వ‌హించే వ్య‌క్తికి అవ‌స‌ర‌మైన మేథో ప‌ర‌మైన‌, రాజ‌కీయ ప‌ర‌మైన‌, పాల‌నా ప‌ర‌మైన పునాదిని ఆయ‌న‌కు ప్ర‌సాదించాయి.  ఆయ‌న త‌న‌కు ఉన్న‌టువంటి అస‌మాన వాక్పటిమ‌ తో ఎన్నో జాతీయ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు.  ఆ కార్య‌క్ర‌మాలు ఆయ‌న సంపాదించిన అపార అనుభ‌వం యొక్క ఫ‌లాలు. ”