‘‘ ప్రధాన మంత్రి ని గురించి అనేక విషయాలను నేను తెలుసుకొన్నాను. ఆయన ఎల్లప్పుడూ ప్రతిఒక్కటీ పూర్తిగా తెలుసుకొంటారు, చాలా కాలం క్రితం నాటి సంగతులను కూడా జ్ఞాపకముంచుకొంటారు, తన మనస్సులో దేనినైనా వెంటనే తీర్మానించుకొంటారు, సరైన ప్రక్రియను అవలంబించి ఫలితం సాధిస్తారు. ప్రక్రియలో ఎవరేం చేయాలో అది చేయాలంటూ ఒత్తిడిని తీసుకువస్తారు. తాను ఎక్కడ వెనుకబడి ఉన్నానన్న విషయమూ ఆయనకు తెలుసును. భిన్నమైన పనులలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తారు. ఆయనతో కలసి నేను చేపట్టే భవిష్యత్ కార్యక్రమాలన్నింటిలోనూ ఈ అంశాలను నేను గుర్తుపెట్టుకొంటాను. ఇప్పటికీ మీరు పరిశీలించే విషయమిది. ’’