నేను ప్రధాన మంత్రి శ్రీ మోదీ ని గురించి మాట్లాడుతున్నానంటే, ఏడాది కన్నా తక్కువ వ్యవధిలోనే, దార్శనికతను విస్తరించగల ఒక మనిషిని గురించి, దాన్ని ఎలా సాధించాలో ప్రాధాన్యతలను వివరించిన వ్యక్తిని గురించి, బాధ్యతాయుతంగా వ్యవహరించగల జట్టు లకు దానిని విస్తరింపచేసిన మనిషిని గురించి, ఒక దిశ వైపు బృందాలను నడిపించడంలో ఆరోగ్యవంతమైన పోటీని ప్రవేశపెట్టిన వ్యక్తిని గురించి, ‘మేక్ ఇన్ ఇండియా’ కలను సాకారం చేసుకొనేందుకు అవసరమైన మార్పులను ప్రవేశపెట్టడంలో సాహసాన్ని ప్రదర్శించిన మనిషిని గురించి మాట్లాడుతున్నానని అర్ధం. మందకొడిగా ఒకరిని అనుసరించే స్థాయి నుండి భారతదేశం నవ్యతలో ప్రపంచానికి దారి చూపే నాయకత్వ స్థాయికి చేరుతుందని నేను గతంలోనే చెప్పాను. 1.3 బిలియన్ ప్రజల గురించి కలలు గనే, వారందరినీ అభివృద్ధి క్రమంలో భాగస్వాములను చేయాలనుకొనే, ఒక మహోన్నత దేశంలో భాగస్వాములను చేసేందుకు వ్యక్తిగత నైపుణ్యాలను ఆసరా చేసుకోవాలనుకొనే ఒక నాయకుని దక్షత ఇది.