ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం నన్నెంతో ప్రభావితుడిని చేసింది. పన్ను ఎగవేతలు, అవినీతి మరియు నల్లధనం నిర్మూలనకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఎంతగా నిబద్ధతను కలిగివున్నారో ఈ నిర్ణయం చాటిచెబుతోంది. ఆర్థిక వ్యవస్థను డిజిటల్ ఇకానమీగా మార్పు చెందే ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఆధునికీకరించాలన్న ధ్యేయంతో తీసుకొన్న చర్య ఇది. మేం ఎంతో ఆసక్తితో ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్నాం. ఆంత్రప్రనర్ లకు సంపూర్ణమైన మద్దతును భారతదేశ ఆర్థిక వ్యవస్థ అందిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని మేము విశ్వసిస్తున్నాము.