మీరు పరిశీలిస్తే ఈ రోజు చేసిన ప్రకటనలు ప్రభుత్వ కార్యక్రమాలతో మిళితమై ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమంతోను, స్టార్ట్- అప్ ప్యాకేజి ‘స్టార్ట్ ఆప్ ఇండియా’ కార్యక్రమంతోను మిళితమై ఉన్నాయి. మేము భారత దేశ మార్కెట్‌ను చాలా దగ్గరగా ఉంటూ అనుసరిస్తున్నాము. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారు, ఆయన కార్యక్రమాల పట్టిక ఏమిటన్నది మేము చాలా సన్నిహితంగా అనుసరిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంస్థల లోకి ప్రవహిస్తున్న పెట్టుబడులు అమోఘం. స్టార్ట్- అప్ ల వ్యవస్థ పుష్పించి ఫలించడం సుస్పష్టంగా తెలుస్తోంది. ఓలా మరియు ఫ్లిప్ కార్ట్ ల వంటి కంపెనీలు చెప్పుకోదగిన స్థాయికి చేరుకొంటూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు.