జెఫ్ వెయిన‌ర్
ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ తో కొద్ది స‌మ‌యం గ‌డిపి ‘స్కిల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్ట్- అప్ ఇండియా’ ల వంటి కార్యక్రమాల సూక్ష్మాలను గురించి ఆయనతో మాట్లాడండి.. ప‌రిపాల‌న‌ లోనే కాదు సామాజిక మాధ్యమ నిర్వ‌హ‌ణ‌ లోనూ ఆయ‌న‌కు ఉన్నటువంటి అవ‌గాహ‌నను మీరు గ్రహించగలుగుతారు.  తనకు సొంతమైన ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వానికి ఒక స్టార్ట్- అప్ సంస్థాపకుడిలోని ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తి, ఉద్వేగం, శ‌క్తి లతో మిళితం చేసి ఆచ‌ర‌ణ‌లోకి తెస్తారు.  దాని ప్ర‌భావం ఎంత‌టిదో  ఫ‌లితాలే నిరూపిస్తాయి.