జెమీ డైమ‌న్‌, జెపిమార్గన్ చేజ్ సిఇఒ
“ మేం భార‌తదేశాన్ని అభిమానిస్తున్నాం. 1945 నుండి మేము ఇక్క‌డ ఉన్నాము. ఈ స‌మావేశం భార‌త వృద్ధికి ఒక నిద‌ర్శ‌నం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వంద‌లాది కంపెనీలు, ఇన్వెస్ట‌ర్లు మాకున్నారు. భార‌త్ ప్ర‌పంచంలోనే త్వ‌రిత‌గ‌తిన వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ అని భార‌తదేశ ప్ర‌జ‌ల‌కు నేను తెలియ‌చేస్తున్నాను. ఇక్క‌డ కొన్ని అద్భుత‌మైన కంపెనీలు ఉన్నాయి. చ‌క్క‌ని విద్యావంతులు ఉన్నారు. ప్ర‌ధాన మంత్రి అన్నీ స‌రైన చ‌ర్య‌లే తీసుకొంటున్నారు. ఇది ఒక గొప్ప‌ దేశం. ’’