“ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని నేను ప్రత్యక్షంగాను, ఆన్ లైన్ లోనూ కలుసుకొన్నాను. ‘సుపరిపాలన’పై ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకొనేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకొన్నాను. ఎప్పుడైనా ఆయన నుండి ఒకే సమాధానం వచ్చేది.. అది ఎప్పుడూ సరికొత్త గానే ఉంటుంది. అది ఏమిటంటే, ఒక గ్రామంలో నేను బస్ స్టాపును నిర్మించాలనుకొంటే గనక నాకు ఇటుకలు చాలు; కానీ, బస్సులు సకాలంలో రాకపోకలు సాగించాలని కోరుకుంటాను. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎక్కువ మంది గ్రామీణ పేదలు బస్సులో ప్రయాణిస్తారు కాబట్టి వారి పట్ల కండక్టర్లు గౌరవభావంతోను, మర్యాదగాను వ్యవహరించడం అన్నదే ఆయన ఇచ్చిన జవాబు. భారతదేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన డూన్ స్కూలు, ఆక్స్ బ్రిడ్జి పూర్వ విద్యార్థులు ఎప్పుడైనా వాటికి సంబంధించిన కార్యాచరణ ను చేపట్టడం అటుంచితే ఇటువంటి ఆలోచనలైనా వారు చేయగలుగుతారా అని నాకు ఒక అనుమానం వస్తూ ఉంటుంది. ”