మరింత చౌకైన ధరలను తీసుకువచ్చే దిశలో జిఎస్ టి తో ఒక మంచి అడుగు పడింది. కొన్ని కార్ల ధరలు దిగిరావడం, మరి కొన్నింటి ధరలు ఎటువంటి మార్పు లేకుండా ఉండడం, ఇంకా కొన్ని కార్ల ధరలు కాస్త ప్రియమవడం మనం చూశాము. అయితే, మాకు మాత్రం జిఎస్ టి వ్యాపారానికి అనువైన నిర్ణయమనిపిస్తోంది. భారతదేశంలో వ్యాపారం చేయడంలో సౌలభ్యం మరింత పెరుగుతుంది. ఈ కారణంగా, ఇది నిజంగా ఎంతో మంచి నిర్ణయం.