టిమ్ కుక్
ప్ర‌ధాన మంత్రి గారూ, నాయ‌క‌త్వంలో మీరు చూపించిన శ‌క్తి, వేగం భార‌తదేశం లో చాలా మందికి ఎన్నో అవ‌కాశాలు ముందుకు తెచ్చింది.  మౌలిక వ‌స‌తుల్లో మీరు పెడుతున్న పెట్టుబ‌డులు “డిజిట‌ల్ ఇండియా” క‌ల సాకారం కావడంలో తోడ్పడనుంది.  ఇంట‌ర్ నెట్ క‌నెక్ష‌న్ లలో రెండో పెద్ద ప్ర‌దేశంగా భార‌తదేశం అవ‌త‌రించింది.  మీ విధాన‌ప‌ర‌మైన చొర‌వ‌లు ప్ర‌జ‌ల‌కు సాధికారితను ప్రసాదించి భార‌తదేశ ప్ర‌జ‌లలోని అసాధార‌ణ‌మైన ప్ర‌తిభాపాట‌వాల‌ను వినియోగంలోకి తెస్తాయి.  అవి ప్ర‌పంచానికే ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నాయి.