యుఎఇ, భారతదేశం.. ఈ రెండు దేశాలూ అద్భుతమైన చారిత్రక వారసత్వంతో పాటు శాంతి, ప్రేమ వంటి ఉమ్మడి భావాలను కలిగివున్నాయి. రెండు సమాజాల మధ్య ప్రాచీన బాంధవ్యం ఉంది. యుఎఇలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవలి పర్యటన ఆ బాంధవ్యానికి కొత్త ద్వారాలు తెరిచింది. భారతదేశం అధిక వృద్ధిరేటును సాధిస్తున్న కారణంగా యుఎఇ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్ లలో ఒక మార్కెట్ గా నిలిచింది. యుఎఇ తన అభివృద్ధి సంబంధిత దార్శనికతలో అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్న రంగాలలో మౌలిక వసతుల రంగం, శక్తి రంగం మరియు పర్యాటక రంగం వంటివి ఉన్నాయి. సమీప భవిష్యత్తులో పరస్పర పెట్టుబడుల విస్తరణకు అనేక అవకాశాలను యుఎఇ అందిస్తోంది.