భారతదేశం ప్రస్తుతం స్థూల ఆర్థిక దృష్టి కోణంలో ఉండి చూసినప్పుడు ఇంత బలమైన స్థితిలో ఎన్నడూ లేదు. నాయకత్వ స్థానంలో ఒక బలవంతమైన వ్యక్తి ఉంటూ, కీలకమైన విధాన సంబంధ మార్పులకు సారధ్యం వహిస్తూ ఉండడంతో దేశం అపారమైన వృద్ధి సామర్థ్యాన్ని కనబరుస్తోంది. ఘనమైన వృద్ధి అవకాశాలు కలిగిన ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థ కావడం చేత భారతదేశంలో మనకు ఒక ముఖ్యమైన ప్రయోజనం సిద్ధిస్తోంది. అవస్థాపన పథకాలు ‘పనులు జరుగుతూ ఉన్న దశ’కు చేరుకొన్నప్పుడు, వాస్తవంగా ఏమీ జరగడంలేదనే భావన నెలకొంటున్నట్లుగా తోస్తుంది. కానీ, భారతదేశం విషయంలో మాత్రం ఇది తథ్యం కాదు. ఒక వైపున మందగతిన వృద్ధి, యూరోపియన్ బ్యాంకులతో సమస్యలు, చైనాలో భారీ ఎత్తున ఓవర్ కెపాసిటీలు ఉంటే, మరొక వైపున కీలకమైన గ్లోబల్ స్టాక్ మార్కెట్లు జీవన కాల గరిష్ఠ స్థాయిలను అందుకోవడమో లేదా ఆ స్థాయిలను సమీపించడమో చోటు చేసుకొంటున్నాయి.