“ గిర్ లో పర్యటన ప్రచారం కోసం నేను తలపెట్టిన చిత్రీకరణలో అది ఒకటవ రోజు. చిత్రీకరణ ముగిసిన తరువాత, శ్రీ బచ్చన్ తో నరేంద్ర భాయ్ ఫోన్ లో మాట్లాడారు. తరువాత నన్ను మాట్లాడమన్నారు. నేను ఫోన్ తీసుకొని, ‘ ఎలా సాగింది చిత్రీకరణ ? ’ అంటూ సాధారణంగా క్లయింట్ వేసే ప్రశ్ననే వేస్తారనుకొన్నాను. ఆయన ‘ నా మనుషులు మిమ్నల్ని (బాగానే) చూసుకుంటున్నారా ?’ అంటూ వాకబు చేసే సరికి, నా చెవులను నేనే నమ్మలేకపోయాను. అంతటితోనే ఆగలేదు.. ‘అమితాబ్ జీ దేశ్ కీ అమానత్ హై, ఔర్ ఆప్ హమారీ’ (అమితాబ్ గారు దేశం ఎంతో నమ్మకంతో అప్పగించినటువంటి వ్యక్తి, అలానే మాకు మీరు కూడాను) అని సైతం ఆయన అన్నారు. నాయకత్వంలో ఒక పాఠం వంటి ఆ పలుకులను నేను ఎన్నటికీ మరచిపోలేను. ’’