పీయూష్ పాండే
‘ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తో నా తొలి ముఖాముఖి స‌మావేశం ఆయ‌న గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు జరిగింది.  గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న విభాగానికి అడ్వ‌ర్‌టైజింగ్ ఏజెన్సీగా ఒ & ఎమ్ ను ఎంపిక చేసుకొన్నారు.  ఆయ‌న నాకు వ్య‌క్తిగ‌తంగా కొన్ని విష‌యాలు వివ‌రించారు. గుజ‌రాత్  యొక్క చ‌రిత్ర‌ను, సంస్కృతిని, గిర్ ప‌ర్వ‌తం గురించి, సాధువుల గురించి, సింహాలు మ‌రియు మ‌నుషుల శాంతియుత స‌హ‌జీవ‌నాన్ని గురించి ఆయ‌న చెప్పుకొచ్చారు.  ఆయ‌న కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాల‌ పాటు దానితో క‌ల‌సి జీవించిన‌ట్లుగా మాట్లాడారు.  అది, తెలివి యొక్క చేష్ట కాదు- జ్ఞానం మ‌రియు ఉద్వేగాన్ని గురించిన ఒక పాఠం అని- నాకనిపించింది.