“ శ్రీ నరేంద్ర మోదీ అసలు సిసలు అసాధారణ వ్యక్తిత్వం గల వారు. సమస్యల్లో ఉన్న వారికి, అన్యాయాలకు గురవుతున్న వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడమే ఆయనలోని పెద్ద బలం. నేను అలాంటి కేసును ఎప్పుడు ఆయన దృష్టికి తీసుకువచ్చినా, తప్పుడు బాటలో నడుస్తున్న వారిని సరిదిద్ది అన్యాయం ఎదుర్కొంటున్న వారికి న్యాయం జరిగే రీతిలో తక్షణ పరిష్కారం లభించింది. ప్రధాన మంత్రిగా ఆయన సరికొత్త దారి చూపే ఎన్నో చర్యలు చేపట్టారు. ఇతరులు కూడా ఆయన బాటలో నడుస్తున్నారు. అధికార యంత్రాంగం ఉక్కు సంకెళ్లను తెంచి వాస్‌ువికమైన మార్పు సాధించడం ఆయన అసలైన నైపుణ్యం. ఈ చర్యలకు భారతదేశం ఆయనను ఎప్పటికీ గుర్తు పెట్టుకొంటుంది. ”