అవినీతిని కూకటి వేళ్లతో పెకలించే దిశగా చేపట్టిన సరైన చర్య ఇది (నోట్ల చట్టబద్ధత రద్దు). ప్రపంచంలో భారీ స్థాయిలో చెలామణి అవుతున్న నల్లధనం ఉగ్రవాదానికి, అక్రమ వ్యాపారానికి కొమ్ము కాస్తోంది. అక్రమ లావాదేవీలు, అక్రమ వాణిజ్యానికి కాలం చెల్లిపోయిందంటూ యావత్తు ప్రపంచానికి ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చినందుకు ప్రధాన మంత్రి శ్రీ మోదీని కొనియాడాలి.