శ్రీ మోదీ మన కళ్ల ముందే భారతదేశాన్ని పరివర్తన చేయగలరని మేము అనుకుంటున్నాము. ఆర్థిక వృద్ధి సాధనను మరియు అవినీతి నిర్మూలనను ఆయన ప్రధాన లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇది అపూర్వం. దేశాన్ని పరిపూర్ణంగా మార్పు చేయగల భారతదేశపు లీ కువాన్ యు గా ఆయన కావాలని మేం ఆశిస్తున్నామని నేను స్వయంగా శ్రీ మోదీ తో అన్నాను.