భారతదేశం కొన్ని అతి చక్కని సంస్కరణలను తీసుకువచ్చింది. ఇవి ఆరంభంలో కఠినమైనవే అయినప్పటికీ, పోను పోను సరైన వేగాన్ని అందుకొంటాయి. మీకు పశ్చిమ దేశాల రాజకీయ నేతలను మించిన దార్శనికతను కలిగివున్న ప్రధాన మంత్రి ఉన్నారు. ఆయన నోట్ల చట్టబద్ధత రద్దు వంటి కఠినమైన చర్యలు తీసుకొంటారు. అయినప్పటికీ ఎన్నికలలో సానుకూలమైన ప్రతిస్పందనను రాబట్టుకొంటారు.