బాబా క‌ల్యాణి
“ నిర్ణ‌యాలు సత్వరమే తీసుకోవ‌డం, వాటి అమ‌లును ప‌ర్య‌వేక్షించ‌డంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ దక్షత అసాధార‌ణం. మేం ఒక‌ప్పుడు మా త‌యారీ విభాగాలలో ఒక విభాగాన్ని గుజ‌రాత్ లోని కొత్త ప్ర‌దేశానికి త‌ర‌లించాల్సి వ‌చ్చింది. అప్ప‌ట్లో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న శ్రీ మోదీ తో నేను స‌మావేశ‌మైన త‌రువాత అతి త‌క్కువ స‌మ‌యంలో మాకు అవ‌స‌ర‌మైన భూమిని కేటాయించ‌డంతో పాటు దానికి అవ‌స‌ర‌మైన పాల‌నాప‌ర‌మైన విధివిధానాల‌న్నీ శీఘ్రంగా పూర్తి చేయించారు. ఇంత వేగవంతమైన నిర్ణ‌యాలు తీసుకొని వాటిని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయ‌డం నా అనుభ‌వంలో నేను ఏ ప్ర‌భుత్వంలోనూ చూడ‌లేదు. ”