బాబా రామ్ దేవ్
శ్రీ మోదీ వోటు బ్యాంకు రాజ‌కీయాలే ప్ర‌ధాన‌మైన నాయ‌కుడు కారు. జాతి నిర్మాణ కాంక్ష గ‌ల నాయ‌కుడు. ఆయ‌న ఎల్లప్పుడూ దేశ అంత‌ర్గ‌త‌ భద్రతపైనా, బ‌హిర్గ‌త భ‌ద్ర‌త‌పైనా దృష్టిని కేంద్రీక‌రిస్తారు. దేశం కోసం మంచి విధానాలను రూపొందించ‌డం, అమ‌లు ప‌ర‌చ‌డం ఆయ‌న ప్రాధాన్ా‌జలు. ప్ర‌పంచ య‌వ‌నిక‌లో భార‌తదేశాన్ని ఆయ‌న స‌రికొత్త ఎత్తుల‌కు తీసుకువెళ్లారు. ఏ ప్ర‌భుత్వంపై అయినా అతి పెద్ద బాధ్య‌త‌లు ఇవే. మోదీ గారు భార‌తదేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తారు. ఎంతో స‌మున్న‌త‌మైన ఈ దేశ సంస్కృతిని గురించి మాట్లాడ‌తారు. ఎంతో ఉజ్జ్వల‌మైనటువంటి భార‌తదేశ చ‌రిత్రను ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తూ వ‌ర్త‌మాన‌, భ‌విష్య‌త్ భార‌త్ పై త‌న దార్శ‌నిక‌త‌ను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు.