బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సహ సంస్థాపకుడు
మానవ వనరులు వృథా అవుతూ ఉండటంపై చేస్తున్న సమరంలో భారతదేశం గెలుస్తోంది.   సుమారు 3 సంవత్సరాల క్రితం భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజారోగ్యం పై అత్యంత సాహసంతో కూడిన వ్యాఖ్యానమొకటి చేశారన్న మాటలను నేను ఎన్నికైన ఓ అధికారి నోటి నుండి వెలువడగా ఆ మాటలను విన్నాను.  అటువంటి సున్నితమైన విషయంపైన అంత నిర్మొహమాటమైనటు వంటి మాటలను అంత బాహాటంగా లేవనెత్తిన ఒక జాతీయ నేత మరొకరు నా ఆలోచనకు తట్టడం లేదు.