బిల్ మెక్ డొనాల్డొ, హెచ్ఎస్ బిసి గ్లోబ‌ల్  సెట్ మేనేజ్ మెంట్ ఎక్విటీస్‌ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీస‌ర్
సంస్క‌ర‌ణ‌ల సూప‌ర్ స్టార్ మోదీ.  ప్ర‌పంచంలో అంద‌రు నాయ‌కుల క‌న్నా ఆయ‌న చాలా మెరుగైన ప‌నితీరు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.  మూడు సంవ‌త్స‌రాల క‌న్నా త‌క్కువ కాలంలోనే ఆయ‌న ఎంతో సాధించారు.  జిఎస్ టి ని విజ‌య‌వంతంగా ఆచ‌ర‌ణ‌లోకి తీసుకురాగ‌లిగారు.  నోట్ల చట్టబద్ధత ర‌ద్దు ప్ర‌త్యేకంగా అతి పెద్ద‌ విజ‌యం.  ఈ సంస్క‌ర‌ణ‌ల ప్ర‌తికూల ప్ర‌భావాలు స్వ‌ల్ప‌ కాలంలో త‌ప్ప‌నిస‌రి అన్న‌ది సుస్ప‌ష్ట‌మే.  అయితే దీర్ఘ‌కాలిక దృక్ప‌థంలో ఆలోచించి కార్యాచ‌ర‌ణ‌కు దిగే ప్ర‌భుత్వం మ‌న‌కు ల‌భించిన‌ట్టు క‌నిపిస్తోంది.