బెంజామిన్ నెతన్యాహూ, ఇజ్రాయల్ ప్రధాని
ప్రధాన మంత్రి మోదీ గారూ, మీ యొక్క ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం నా యొక్క ‘మేక్ విత్ ఇండియా’ విధానంతో సరిపోలుతుంది.  మేము మన మధ్యనున్న సాంకేతిక విజ్ఞాన సంబంధిత సహకారాన్ని మరింతగా పెంపొందించుకొనేందుకు 40 మిలియన్ డాలర్ల నవకల్పన నిధిని ఏర్పాటు చేస్తున్నాము.  మన భాగస్వామ్యం నీరు, వ్యవసాయం, భద్రత, శక్తి మరియు పలు ఇతర రంగాలకు విస్తరించినటువంటిది.  విజయం యొక్క సూత్రం సులభమైందని నేను నమ్ముతాను. అదే ఐ2 టి2. దీని అర్థం- ఇండియన్ టాలంట్, ఇజ్రాయలీ టెక్నాలజీ అని. ఇది రేపటి కోసం ఇజ్రాయల్, భారతదేశం సంబంధాలకు తుల తూగేటటువంటిది.