బెంజామిన్ నెతన్యాహూ, ఇజ్రాయల్ ప్రధాని
ఇజ్రాయల్ లోకి మీకు ఇదే స్వాగతం.. ‘‘ ఆప్ కా స్వాగత్ హై మేరే దోస్త్. ’’  మీ రాక కోసం మేము, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాము.   భారతదేశాన్ని మేము ప్రేమిస్తాము.. ఐక్య రాజ్య సమితిలో మన మొదటి సమావేశంలో మీరు నాతో ..  భారతదేశం , ఇజ్రాయల్ ల విషయానికి వస్తే, ఆకాశమే హద్దు అంటూ చెప్పింది నాకు జ్ఞాపకముంది.  కానీ, ప్రధాన మంత్రి గారూ, ఈ మాటలకు ఇప్పుడు మనం అంతరిక్షంలోనూ సహకరించుకొంటున్నామని నన్ను మరో మాటను జోడించనివ్వండి.. మనం ఇరువురం (భారతదేశం- ఇజ్రాయల్ బంధాల కోసం) మరిన్ని మంచి పనులను చేయగలం.