మాన్య శ్రీ శేఖ్ మొహమ్మ‌ద్ బిన్ జాయేద్‌, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌
నా ప్రియ మిత్రుడు, భార‌త‌దేశం యొక్క ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి ఆయ‌న పార్టీ సాధించిన ఎన్నిక‌ల విజ‌యం ప‌ట్ల అభినంద‌న‌లు తెలియజేయడానికని టెలిఫోన్ ద్వారా మాట్లాడడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మ‌న యొక్క బ‌ల‌మైన మన ద్వైపాక్షిక సంబంధాల‌ ను గాఢ‌ త‌రం చేసుకోవ‌డం కోసం క‌ల‌సి ప‌ని చేయ‌డాని కి మేము ఎదురుచూస్తున్నాము. భార‌త‌దేశం మ‌రియు భార‌త‌దేశం లోని స్నేహ‌శీలురైన ప్ర‌జానీకం మ‌రింత అభివృద్ధి కి నోచుకొని, సమృద్ధి ని పొందాలని యుఎఇ ఆకాంక్షిస్తోంది.