భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోని ఇతర దేశాలకు ప్రవేశం లభించే విధంగా దాని తలుపులను తెరవడంలో ఇంతవరకు అనుసరిస్తూ వచ్చిన వైఖరిని మార్చేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను చెప్పుకోదగ్గ రీతిలో మెరుగు పరచగలిగిన సంస్కరణలను ప్రవేశపెట్టడానికి ఆయన ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని అర్థం.. మౌలిక వసతులపై పెట్టుబడి పెట్టడం మొదలుకొని, మరింత సంపదను సృష్టించడం కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజల చెంతకు చేరుకోవడం నుండి సువిశాలమైనటు వంటి జిఎస్ టి పన్నుల వ్యవస్థను అమలులోకి తీసుకు రావడం వరకు కృషి చేయడమన్న మాట.