నిలకడ కలిగిన ఆర్థిక వ్యవస్థ, తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం, వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి) వంటి సంస్కరణలతో పాటు నూతనమైన ఇన్ సాల్వెన్సీ రూల్స్.. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే, ప్రపంచంలో అగ్రగామి పెట్టుబడి కేంద్రాలలో ప్రస్తుతం భారతదేశం కూడా ఒక కేంద్రం. నోట్ల చట్టబద్ధత రద్దును మొదట్లో వృద్ధికి ఒక అడ్డంకిగా భావించినప్పటికీ, అది అవినీతికి కళ్లెం వేయడంలో మరియు నగదును తక్కువ స్థాయిలో వినియోగించే ఆర్థిక వ్యవస్థకు మళ్లేందుకు తోడ్పడడంలో దోహదం చేయగలుగుతుంది.