ఏ విపణిలో అయినా మమ్మల్ని ఆకట్టుకునే అంశం మార్కెట్ విస్తృతే. అవును, మాకు ఆర్థిక వ్యవస్థే ప్రధానం. భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కటే వృద్ధి పథంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ. మౌలిక వసతుల ఆధునికీకరణ దిశగా భారతదేశం ముందుకు సాగుతోంది. దాని ప్రభావం సహజంగానే ఐటి పై ఉంటుంది. విస్తృతి పరంగా అభివృద్ధి చెందుతూ ఆధునికీకరణ అవకాశాలు, ఉత్పాదక సామర్థ్యాలు గల ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఓరేకల్ వంటి సంస్థకు అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్. దీనికి తోడు భారతదేశం లో మాదిరిగా ప్రతిభావంతులైన విద్యావంతులను అందించగలిగితే అది మరింత అద్భుతంగా ఉంటుంది. భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటైజేషన్ విషయంలో స్పష్టతను ప్రదర్శిస్తున్నారు. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ తో నేరుగా బంధం కలిగి ఉంటుంది. ఈ అవకాశం కోసం మేము ఎదురు చూస్తున్నాము.