నరేంద్ర భాయ్ ఏం అనుకున్నా దానిని ఆయన చేసి చూపిస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పెద్ద పరివర్తిత శక్తి కలిగినటువంటి నాయకునిగా చరిత్ర గుర్తిస్తుంది. చారిత్రకమైన కార్యక్రమాలతో ఆయన తొలుత గుజరాత్ లో పరివర్తనను తీసకువచ్చారు. ఇక ఇప్పుడు భారతదేశ పరివర్తన కోసం పాటు పడుతున్నారు. ‘డిజిటల్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’, ఇంకా ఇతర కార్యక్రమాలు భారతదేశాన్ని ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి, సమృద్ధమైనటువంటి దేశంగా తీర్చిదిద్దుతాయి.