ముకేశ్ అంబానీ, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్‌
దేశ ప్ర‌జ‌ల‌నే కాదు, ప్ర‌పంచాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని కూడా అర్ధం చేసుకున్న నాయ‌కుడు ల‌భించ‌డం మ‌న అదృష్టం. ఒక‌సారి ప్ర‌ధాన మంత్రి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు (బ‌రాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో) వెళ్లిన‌ప్పుడు జ‌రిగిన విందు స‌మావేశంలో వారు ఇరువురూ సాంకేతిక విజ్ఞానం ప్ర‌జ‌ల‌కు ఏ విధంగా ప్ర‌యోజ‌న‌కారి అవుతుంది, దేశాన్ని అభివృద్ధి చేయ‌డం ఎలా అనే అంశాలనే చ‌ర్చించ‌డం న‌న్ను బాగా ఆక‌ట్టుకుంది.