ప్రధాన మంత్రి మోదీ తమ ప్రసంగంలో నా పేరును ప్రస్తావించడం నన్ను ఎంతో సంతోషపరిచింది. అంతే కాకుండా ఆశ్చర్యపరిచింది కూడా. భారతదేశం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. నా దేశంలో ఆయన మాట్లాడుతూ, నా పేరును ప్రస్తావించడంతో పాటు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సముదాయాన్ని గురించి కూడా మాట్లాడటం నిజంగా ఒక గొప్ప గౌరవం. ఇది ఎంతో ఘనమైనటువంటి విషయం. శ్రీ లంకకు సంబంధించినంత వరకు చూస్తే భారతదేశం ఒక పెద్దన్నయ్య వంటిది. మనం పంచుకొంటున్న అనుబంధం అటువంటిది. మాకు భారతదేశం యొక్క సాయం కావాలి. భారతదేశం ఎన్నో రకాలుగా మాకు తోడ్పడగలుగుతుంది. అది మా దేశానికి ఎంతో ఘనమైన సంగతి. ప్రతి ఒక్కరి మాదిరిగానే ప్రధాన మంత్రి మోదీని మేము అభిమానిస్తున్నాము. భారతదేశ ప్రజల కోసం ఆయన ఎన్నో పనులు చేశారు. ఇంతవరకు ఎన్నో కార్యాలను ఆయన సాధించారు. ఆయన ప్రజాదరణ అంతకంతకు పెరుగుతోంది. ఎన్నికల కాలంలో దీనిని మీరు పరిశీలించవచ్చు. ప్రజలు ఆయనను అభిమానిస్తున్నారని నేను అనుకుంటున్నాను.