"మీరు పారిశుద్ధ్య పరిష్కారాలలో ఒక డాలర్ పెట్టుబడిపెడితే, ఆరోగ్య ఖర్చుల నివారణ పరంగా నాలుగు డాలర్లు ప్రయోజనం ఉంటుంది, మీరు వైద్యుల దగ్గరకి వెళ్ళే సందర్శనల సంఖ్యలోనూ మరియు మీరు కొనుగోలు చేయాల్సిన మందులలోనూ (తగ్గుదల) ఉంటుంది. ప్రధానమంత్రి (ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం వంటి అంశాలలో) రాజకీయ సమయాన్ని మరియు కృషి ని పెట్టుబడిగా పెట్టారు; ప్రజలు దీనిని అందిపుచ్చుకోవడం మొదలుపెట్టారని అర్థం చేసుకోవచ్చు. వారు ఈ పనిని మహాత్మా గాంధీ కోసం, తమ దేశం కోసం చేయాలనుకుంటున్నారు; ఈ పని పట్ల వారు గర్వపడుతున్నారు కూడా."