యోగేశ్ చంద‌ర్ దేవేశ్వ‌ర్‌
మీ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా మీకు హార్దిక శుభాకాంక్ష‌లు. సుదీర్ఘ జీవ‌నం, మంచి ఆరోగ్యం, ఆకాంక్ష‌ల సాఫ‌ల్యం మీకు ల‌భించాల‌ని నేను కోరుతున్నాను. మీ దార్శ‌నిక‌త‌ లోని ధైర్యం, మీ ఆలోచ‌న‌ల్లోని స్ప‌ష్ట‌త‌, ఒక ల‌క్ష్యం, భావోద్వేగంతో మీరు చేప‌ట్టే పాల‌నాప‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌, భార‌తదేశం ఎదుర్కొంటున్న తీవ్ర‌మైన స‌వాళ్ళ‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో మీరు ప్ర‌ద‌ర్శించే ముందుచూపు, అంత‌ర్ దృష్టి న‌న్ను ఎంతో స్ఫూర్తిదాయ‌కాలు. మీ లోని అసాధార‌ణ‌మైన శ‌క్తి, అనిత‌ర‌ సాధ్య‌మైన యుక్తి, వ్య‌క్తిగ‌త స‌మ‌గ్ర‌త‌, క‌ట్టుబాటు, సాహ‌సం ఒక బ‌ల‌మైన స్ఫూర్తిగా నిలిచి ముందుకు న‌డిపిస్తాయి. మీరు తీసుకున్న బ‌హుముఖీన‌మైన చ‌ర్య‌లు భార‌త ఔత్సాహిక పారిశ్రామిక ధోర‌ణుల‌కు కొత్త ఉత్తేజం క‌ల్పించి కోట్లాది ప్ర‌జ‌ల జీవితాల్లో ప‌రివ‌ర్త‌నను తీసుకు రాగ‌లిగేలా భార‌తదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ముఖ‌చిత్రాన్ని మార్చేస్తాయ‌న్న కొత్త ఆశ‌లు చిగురించాయి. మీకు మా శుభాభినంద‌న‌లు ఎప్పుడూ ఉంటాయి.