రిచర్డ్ హోర్టన్, సంపాదకులు, లాన్సెట్, యూకే కేంద్రంగా పనిచేస్తున్న వైద్య పత్రిక
"ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను పౌరుల సహజ హక్కుగా మాత్రమే కాకుండా, భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి ఆకాంక్షలను తీర్చే రాజకీయ సాధనంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించారు ... సంవత్సరాల నిర్లక్ష్యం తరువాత, చివరికి ఆరోగ్యం గురించి  ప్రజల అసంతృప్తిని భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాది ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ అనే కొత్త కార్యక్రమంలో భాగంగా,  రెండు కొత్త ప్రధాన కార్యక్రమాలను ప్రధానమంత్రి మోదీ అమలు లోకి తీసుకువచ్చారు.  ఈ జంట కార్యక్రమాలు నాణ్యమైన ఆరోగ్య సేవల లభ్యత ను మెరుగుపరనున్నాయి; అంతే కాక రోగులు స్వయంగా భరించవలసిన జరిగే ఆరోగ్య వ్యయాలను తగ్గించనున్నాయి."