‘‘ చారిత్రకంగా లంచగొండితనంతో నిండిపోయిన రంగాలలో ప్రధాన మంత్రి మోదీ పారదర్శకతను తీసుకు వచ్చారు. సబ్సిడీల రంగంలో డిజిటైజేషన్ ను మరియు ప్రభుత్వ వనరుల వేలం పాటలో ఎలక్ట్రానిక్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా ఈ పనిని ఆయన పూర్తి చేశారు. మన పురోగమనానికి కీలకమైనటువంటి అధికార వర్గం యొక్క సమర్థతను మరింత జవాబుదారీతనంతో ముడివేయడం జరిగింది. ఈ అంశాలన్నీ దేశానికి ఒక సరికొత్త గర్వ కారణమైన భావనను రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుండా 21వ శతాబ్దానికి చెందిన భారతదేశంలో ఒక తరానికి సంబంధించిన కీలక పరివర్తన చోటు చేసుకోగలదన్న వాగ్దానం కూడా ఇందులో ఇమిడి ఉంది. ’’