“ ప్రధాన మంత్రి మోదీ పాలనలో గత రెండు సంవత్సరాలలోనూ నేను గమనించిన స్పష్టమైన మార్పు మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా అర్హమైనటువంటి స్థానాన్ని ఎలా పొందుతున్నామన్నదే. ఈ స్థానాన్ని మనకు కట్టబెడుతోంది ‘మేక్ ఇన్ ఇండియా’ అనే ఆలోచనే. అలాగే, ఆయన అంతర్జాతీయ సముదాయం చెంతకు చేరేందుకు అవిశ్రాంతంగా పాటుపడుతూ, భారతదేశాన్ని అంతర్జాతీయ దౌత్య రంగస్థలం పైకి తీసుకువెళ్ళారు; అది కూడా మన ఆత్మగౌరవాన్ని, స్వీయ మన్ననను కాపాడుతూనే, ఆ పనిని ఆయన నెరవేర్చారు. ఇప్పుడు మనకు సమయం వచ్చింది. భారతదేశానికి మెరుగైన సారథ్యాన్ని ఇక మరెవ్వరూ అందించలేరు! ”