వై.సి. దేవేశ్వ‌ర్
‘‘ మీ దార్శ‌నిక‌త‌లోని సాహ‌సం, ఆలోచ‌న‌లలోని స్ప‌ష్ట‌త‌, ఒక స్థిర‌మైన ల‌క్ష్యం, భావావేశంతో ప‌రిపాలిస్తున్న తీరు, దేశం ఎదుర్కొంటున్న‌ కొన్ని ప్ర‌ధాన‌ స‌వాళ్ళ‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో మీరు ప్ర‌ద‌ర్శించే అంత‌ర్ దృష్టి, ముందుచూపు న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.  ఎల్లలు లేనటువంటి మీ శ‌క్తి, అజేయ ఉత్సాహం, మూర్తీభవించిన నైతిక నిష్ఠ, నిబద్ధత, ఎల్లప్పటికీ ముందు నిలబడి దేశాన్ని న‌డిపించే ధైర్యాలు ఒక గొప్ప స్ఫూర్తిని అందిస్తూ ఉంటాయి.  మీరు చేప‌ట్టిన బ‌హుముఖీన చ‌ర్య‌ల‌తో భార‌తీయులలోని పరిశ్రమల సారథ్య సామ‌ర్థ్యాలు వెలికి రావ‌డ‌మే కాదు, కోట్లాది భార‌తీయుల స్థితిగ‌తులు మెరుగుప‌డే రీతిలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో సమూల ప‌రివ‌ర్త‌న ఏర్ప‌డుతుంద‌న్న స‌రికొత్త ఆశ‌లను చిగురింపచేసింది.