వ్యవసాయ శాస్త్రవేత్త, ఎం.ఎస్. స్వామినాథన్
ఫార్మర్స్ కమిషన్ చేసిన సిఫార్సులలో అనేక సిఫార్సులను మోదీ ప్రభుత్వం అమలు చేసింది.  వీటిలో మెరుగైన విత్తనాలను అందించడం, భూమి స్వస్థత కార్డులు, మెరుగైన బీమా కోసం ఫార్మర్స్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలుచేయడం, సాగు నీటి వసతి ఉండే ప్రాంతాన్ని విస్తరింప చేయడంతో పాటు, రైతుల సంక్షేమాన్ని వ్యవసాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలలో ఒకటిగా చేర్చడం వంటివి కొన్ని.  వ్యవసాయ సంబంధ పనులలో 50 శాతం పనులను గ్రామీణ ప్రాంత మహిళలే చేస్తున్నారు.  వారి మార్కెట్ నైపుణ్యాలను వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ రంగం ద్వారా పెంపొందించడం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది.