శేఖ్ హ‌సీనా, బాంగ్లాదేశ్ ప్ర‌ధాని
భార‌త‌దేశం లో జ‌రిగిన 17వ లోక్ స‌భ ఎన్నిక‌ల లో మీ (ప్రధాన మంత్రి శ్రీ మోదీ) యొక్క చురుకైన నాయ‌క‌త్వం లో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బిజెపి) నేతృత్వం లోని నేశ‌నల్ డెమోక్రటిక్ అల‌య‌న్స్ (ఎన్‌డిఎ) ఘ‌న విజ‌యాన్ని సాధించినందుకు మీకు ఇవే నా హృద‌య పూర్వ‌క అభినంద‌న‌లు. ఈ విస్ప‌ష్ట‌మైన‌ తీర్పు ప్ర‌పంచం లో కెల్లా అతి పెద్ద‌దైన ప్ర‌జాస్వామ్య దేశం యొక్క ప్ర‌జ‌లు మీ ప‌ట్ల ఉంచిన ధైర్యానికి మరియు విశ్వాసాని కి ఒక ప్ర‌తిబింబం గా ఉంది