“ వ్యాపారపరమైన వాతావరణాన్ని మెరుగు పరచడం మరియు దానిని వ్యాపారానికి సులభ తరంగా మార్చే శ్రద్ధ స్వయం గా ప్రధాన మంత్రి స్థాయి లో వ్యక్తం అయినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఇది యావత్తు ప్రభుత్వం లోనూ ప్రతిఫలిస్తోంది. భారతదేశం ఆర్థికం గా సమృద్ధం కావాలంటే దేశం లో వ్యాపారం చేయడాన్ని సరళతరంగా మార్చడం పట్ల అదే పని గా శ్రద్ధ ను వహించడమే సరి అయిన పద్ధతి అని నేను తలుస్తాను. ”