శ్రీ ఎన్‌.ఆర్. నారాయ‌ణ‌ మూర్తి, స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, ఇన్ఫోసిస్
“కేంద్రం స్థాయి లో అవినీతి ని త‌గ్గించ‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ, ఆయ‌న మంత్రివ‌ర్గం చాలా శ్ర‌మించింది.  కేంద్ర ప్ర‌భుత్వ స్థాయి లో అవినీతి జరిగిందన్న  ఒక్క ఫిర్యాదునైనా నేను విన‌డం అరుదే.  ప్ర‌ధాన మంత్రి ఒక బ‌ల‌మైనటువంటి, ఆర్థిక రంగ ప‌రంగా పురోగ‌తిని దృష్టి లో పెట్టుకున్నటువంటి ప్ర‌భుత్వానికి నాయకత్వాన్ని వ‌హించినట్టుగా నేను భావిస్తున్నాను.  భార‌త‌దేశానికి మెరుగులు దిద్దాల‌న్న ఆస‌క్తి ని క‌లిగివున్న శ్రీ మోదీ వంటి ద‌క్షత కలిగిన కనీసం ఒక జాతీయ నాయ‌కుడంటూ ఉన్నందుకు గాను మ‌నం కృత‌జ్ఞుల‌మై ఉండాలి.  గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాల‌ ను ప‌రిశీలిస్తే, దేశం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించిన, క్ర‌మ‌శిక్ష‌ణ, ప‌రిశుభ్ర‌త, ఇంకా ఆర్థిక పురోగ‌మ‌నం ప‌ట్ల త‌త్ప‌ర‌త క‌లిగిన ఒక నాయ‌కుడి ని మ‌నం క‌లిగివుండడమనేది ఒక మంచి విష‌య‌ం అని నేను త‌లుస్తాను.  ప్ర‌భుత్వ కొన‌సాగింపు ఒక మంచి అంశం కాగ‌లదు. ”