శ్రీ ఎన్‌. చంద్ర‌శేఖ‌ర‌న్‌, చైర్ మన్‌, టాటా గ్రూప్
“గౌర‌వ‌నీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయ‌క‌త్వం లో భార‌త‌దేశం గ‌త ఐదు సంవత్సరాలు గా మార్పు దిశ‌ గా ప‌య‌నిస్తోంది. ఈ ఐదేళ్ల‌ లో అద్భుత‌మైన ప్ర‌గ‌తి ని సాధించ‌డం జ‌రిగింది. అనేక కార్య‌క్ర‌మాల‌ ను చేపట్టడమైంది. భ‌విష్య‌త్తు లో ప‌లు సంవ‌త్సరాల పాటు, ఆ మాట‌కొస్తే ద‌శాబ్దాల‌ పాటు గ‌ణ‌నీయ స్థాయి లో వృద్ధి ని సాధించ‌డం కోసం ఒక వేదిక‌ ను రూపొందించ‌డం జ‌రిగింది. ఇంత త‌క్కువ స‌మ‌యం లో ఎన్నో విజ‌యాలను సాధించినందుకు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి నా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.”