శ్రీ కిమ్ యాంగ్ రే, ఉప‌ మంత్రి, వాణిజ్యంన, ప‌రిశ్ర‌మ‌లు మ‌రియు శక్తి శాఖ‌, ద‌క్షిణ కొరియా
“అంత‌ర్జాతీయ ఆర్ధిక‌రంగంలో కీల‌క‌ పాత్ర ను పోషించే దేశం గా ప‌రిణ‌మించ‌డానికి భార‌తదేశాని కి అత్యున్న‌తమైన ప్ర‌తిభాపాట‌వాలు ఉన్నాయి. దేశం లో వున్న యువ‌త, అధిక జ‌నాభా, నైపుణ్యం గ‌ల కార్మికులు, ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల కార‌ణం గా భార‌త‌దేశాని కి ఈ అవ‌కాశం ఉంది. ప్రధాన మంత్రి గా బాధ్య‌త‌ల ను స్వీక‌రించిన అనంతరం శ్రీ న‌రేంద్ర మోదీ ప‌లు సంస్క‌ర‌ణ‌ల ను ముందుకు తీసుకుపోతున్నారు. భార‌త‌దేశాన్ని వ్యాపార, వాణిజ్య రంగ అనుకూల దేశం గా తీర్చిదిద్దుతున్నారు.”