“భారతదేశం లో వేగం గా సంభవిస్తున్న మార్పుల కు గుజరాత్ ఉజ్వలమైన ఉదాహరణ గా నిలుస్తోంది. భారీ ఏకత విగ్రహం యొక్క స్థాపనే దీని కి ప్రబల నిదర్శనం గా నిలుస్తోంది. గత ఐదు సంవత్సరాల్లో పది బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ గా ఎఫ్ డిఐ లు గుజరాత్ కు తరలివచ్చాయి. ఇందులో చాలా భాగం ఈ రాష్ట్రం లో పారదర్శకమైన, స్థిరమైన, నియమ నిబంధనల ప్రకారం నడుచుకునే ఆర్ధిక వ్యవస్థ నెలకొన్న కారణం గా సాధ్యపడింది. ఈ విజయానికి గాను ఖ్యాతి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి దక్కితీరాలి. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లోనే ఎంతో కష్టపడి రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చివేశారు.”