“అంతర్జాతీయం గా ఆర్ధిక వృద్ధి లో భారతదేశం కీలక పాత్ర ను పోషిస్తుందనే అంశం పై అంతర్జాతీయం గా తగిన నమ్మకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కల్పించారు. ఆర్ధిేక సంస్కరణల ను అమలు చేయడం లో మీ సామర్థ్యం అసమానమైంది. అంతే కాదు సామాజిక సంస్కరణల ప్రణాళికల ను అమలు చేయడం లోనూ మీ సామర్థ్యం అసాధారణమైంది. ఆధునిక చరిత్ర లో మరెవ్వరూ చేయని విధం గా సామాజిక సంస్కరణల ను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ప్రాథమికం గా మీరు భారతదేశాన్ని పునర్ నిర్మిస్తున్నారు. చరిత్ర ను పరిశీలిస్తే ఈ మధ్య కాలం లో భారతదేశం లో అత్యధిక జనాభా కు అతి తక్కువ సమయం లో సాధికారిత ను కల్పించిన నాయకుడు మరొకరు లేరు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే దాని కి మీరు నిజమైన అర్థాన్ని చూపారు”