“మనకు అందరి కి తెలుసు.. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కారణంగానే ఈ వైబ్రెంట్ గుజరాత్ సదస్సు రూపొందిందని. దేశం లోని మారు మూల ప్రాంతాల్లో సైతం మీ కల లు ప్రతిఫలిస్తాయని గతం లో ఎవరూ ఊహించలేదు. ఉద్యమ స్థాయి లో భారతదేశ పారిశ్రామిక వాతావావరణం లో సమూల మార్పు లు వస్తాయని అప్పుడు అనుకోలేదు. మీకు ఉన్న అద్భుతమైన ముందుచూపు కు వైబ్రంట్ గుజరాత్ మొదటి సూచిక. ఈ సదస్సు మీరు అందించిన ముఖ్యమైన అంశాల తో, సమున్నతంగా ఎదిగిన దార్శనికత తో, సుపరిపాలన తో, ఎలాంటి తప్పులకు తావు లేని నిర్వహణ తో ఎదుగుతోంది.”